🏠 aayudham.net
Watermark
Clip Header Logo
Date of Publish : 28 September 2026, 8:55 pm Posted by : AAYUDHAM

డీజేల దూకుడుకు బ్రేక్‌.. ప్రశాంతంగా వినాయక నిమజ్జనం

News Image
ముఖ్యమైన పాయింట్స్:చింతకాని ఎస్‌ఐ నరేశ్‌కు బీఆర్‌ఎస్‌ నాయకుల అభినందనలు
డీజేల దూకుడుకు బ్రేక్‌.. ప్రశాంతంగా వినాయక నిమజ్జనం

చింతకాని ఎస్‌ఐ నరేశ్‌కు బీఆర్‌ఎస్‌ నాయకుల అభినందనలు

చింతకాని, సెప్టెంబరు 28 (ఆయుధం): గణేష్‌ నవరాత్రుల సందర్భంగా చింతకాని మండలంలోని 26 గ్రామాల్లో వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యలను బీఆర్‌ఎస్‌ నాయకులు అభినందించారు. నిబంధనలకు అనుగుణంగా నిమజ్జనాలు నిర్వహించేలా డీజేల వినియోగంపై నియంత్రణ చర్యలు చేపట్టిన చింతకాని ఎస్‌ఐ జి. నరేశ్‌ను బీఆర్‌ఎస్‌ నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ అధ్యక్షులు, సొసైటీ డైరెక్టర్లు కలిసి సత్కరించారు.

మండలంలోని అన్ని గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా పోలీస్‌ శాఖ ముందస్తు చర్యలు చేపట్టిందని నాయకులు తెలిపారు. అధిక శబ్దంతో కూడిన డీజేల వినియోగాన్ని నియంత్రించడం వల్ల ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు ఇబ్బందులు లేకుండా వేడుకలు నిర్వహించేందుకు అవకాశం కలిగిందన్నారు.

నిమజ్జన వేడుకల్లో భద్రత, శాంతిభద్రతలకు ప్రాధాన్యమిస్తూ ఎస్‌ఐ నరేశ్‌ తీసుకున్న చర్యలు అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. పోలీసుల సూచనలకు ప్రజలు, వినాయక ఉత్సవ కమిటీలు సహకరించడం వల్ల మండలంలో నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగాయని తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ నరేశ్‌కు పూలబొకే అందజేసి, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
🏠 Home