🏠 aayudham.net
Watermark
Clip Header Logo
Date of Publish : 30 September 2026, 11:19 am Posted by : AAYUDHAM

తుటికుంట్లలో క్రిస్టల్ పత్తి క్షేత్ర ప్రదర్శన సీసీహెచ్‌ 369 రకంపై రైతులకు అవగాహన

News Image
తుటికుంట్లలో క్రిస్టల్ పత్తి క్షేత్ర ప్రదర్శన
సీసీహెచ్‌ 369 రకంపై రైతులకు అవగాహన

పొద్దుటూరు, సెప్టెంబర్‌ 30 (ఆయుధం):
పొద్దుటూరు మండలం తుటికుంట్ల గ్రామంలో రైతు తన్నీరు శ్రీనివాసరావు పొలంలో క్రిస్టల్ కంపెనీ ఆధ్వర్యంలో పత్తి క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. క్రిస్టల్ కంపెనీకి చెందిన సీసీహెచ్‌ 369 పత్తి రకంలో పూత, పత్తి కాయల ఏర్పాటుతో పాటు పంట దిగుబడికి సంబంధించిన అంశాలను రైతులకు వివరించేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఖమ్మం క్రిస్టల్ కంపెనీ టిబీఎం సచిన్ సింగ్ రైతు తన్నీరు శ్రీనివాసరావును శాలువాతో సన్మానించి, బహుమతిని అందజేశారు.
కార్యక్రమంలో క్రిస్టల్ కంపెనీ ఫీల్డ్ సిబ్బంది వడ్డెబోయిన కృష్ణ, కరణం తిరుమలరావు, సాహితి ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ డీలర్ పాపినేని రమేష్ పాల్గొన్నారు. పరిసర గ్రామాలకు చెందిన పలువురు రైతులు క్షేత్ర ప్రదర్శనను వీక్షించి పత్తి పంట సాగు, పత్తి కాయల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
🏠 Home