పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం నాగులవంచలో ఘనంగా పోషకాహార మాసోత్సవాలు చింతకాని, సెప్టెంబరు 28 (ఆయుధం): చింతకాని మండలం నాగులవంచ గ్రామపంచాయతీ పరిధిలోని 4వ అంగన్‌వాడీ కేంద్రంలో సర్పంచ్ నారగాని రాంబాయి అధ్యక్షతన పోషకాహార మాసోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ సూపర్‌వైజర్ కె. సత్యవతి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. గర్భం నుంచి చిన్నారులకు రెండేళ్ల వయస్సు వరకు తొలి 1,000 రోజుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆకుకూరలు, పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. సర్పంచ్ రాంబాయి మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని...