జగ్గయ్యపేటలో కొనసాగుతున్న ప్రజా పోరుబాట
జగ్గయ్యపేటలో కొనసాగుతున్న ప్రజా పోరుబాట క్రిస్టియన్‌పేటలో 16వ రోజు గడపగడపకు వైఎస్సార్‌సీపీ నేతలు జగ్గయ్యపేట, సెప్టెంబర్ 29 (ఆయుధం): జగ్గయ్యపేట పట్టణంలోని క్రిస్టియన్‌పేట 25వ వార్డులో మంగళవారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 16వ రోజు గడపగడపకు ప్రజా పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొని వార్డులోని ప్రతి గడపను సందర్శిస్తూ ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలని తన్నీరు నాగేశ్వరరావు ప్రజలను కోరినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా...