Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

Author
Posted By AAYUDHAM
| 28 Sep 2026, 09:14 PM | Array
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

నాగులవంచలో ఘనంగా పోషకాహార మాసోత్సవాలు

చింతకాని, సెప్టెంబరు 28 (ఆయుధం): చింతకాని మండలం నాగులవంచ గ్రామపంచాయతీ పరిధిలోని 4వ అంగన్‌వాడీ కేంద్రంలో సర్పంచ్‌ నారగాని రాంబాయి అధ్యక్షతన పోషకాహార మాసోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్‌ సూపర్‌వైజర్‌ కె. సత్యవతి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. గర్భం నుంచి చిన్నారులకు రెండేళ్ల వయస్సు వరకు తొలి 1,000 రోజుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆకుకూరలు, పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.

ఇవి కూడా చదవండి

సర్పంచ్‌ రాంబాయి మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. పల్లె దవాఖానా వైద్యుడు డాక్టర్‌ విష్ణుమాధవ్‌ చిన్నారులు, గర్భిణులకు అవసరమైన టీకాలు, ఆహార నియమాలపై అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణులకు శ్రీమంతాలు, చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాశన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్‌, వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, వీఓ సభ్యురాళ్లు, ఆయాలు, గ్రామ పెద్దలు, తల్లులు పాల్గొన్నారు.